Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్రీడలు విజయ శిఖరాలు

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: క్రీడలు విజయ శిఖరాలు అని ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్ పేర్కొన్నారు. సోమవారం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనుబంధ తైల సాంకేతిక , పరిశోధన సంస్థ వారికోత్సవ వేడుకలను పురస్కరించుకొని క్రీడా పోటీలు సంబరాలను ఉపకులపతి , ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య బి. దుర్గా ప్రసాద్ జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు,
ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ క్రీడలు ఆడటం వలన శారీరక , మానసిక అబివృద్ధి చెందుతుందని, గెలుపు ఓటమిలు జీవితంలో సహజం అన్న భావన కలిగి గెలుపు కోసం పడే శ్రమ గుర్తిస్తారని తెలిపారు. ఓర్పు, శక్తి, పట్టుదల, సహనం క్రీడలు ఆడటం వలన అబివృద్ది చెందుతాయని తెలిపారు. అనంతరం క్రీడా పోటీలను లాంచనంగా ప్రారంబించి మొదటగా యం.ఫార్మసీ , చివరి సంవత్సరం విద్యార్థుల మధ్య క్రికెట్ పోటీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమములో ప్రిన్సిపాల్ డాక్టర్ సి. గోపీనాథ్ , సంస్థ భోధన, భోధనేతర,వ్యాయమ ఉపాధ్యాయుడు ధనుంజయ మరియు యం.మహేష్, మధు మరియు తిరుమల నాయక్, అవుట్ సోర్సింగ్ , విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img