విశాలాంధ్ర – జేఎన్టీయూఏ : క్రీడలు విజయ చిహ్నాలు అని ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్, రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ పేర్కొన్నారు. బుధవారం స్పోర్ట్స్ డే,ప్రపంచ పారిశ్రామికవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై సప్తగిరి వరకు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపక బృందం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బి. దుర్గ ప్రసాద్, సుమలత , ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అరుణ క్రాంతి , పి ఆర్ ఓ రామ శేఖర్ రెడ్డి , అధ్యాపకు బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.