Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

క్రీడలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయి : సర్పంచ్ రవి యాదవ్

విశాలాంధ్ర- నందికొట్కూర్ : ప్రతి ఒక్కరికి క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని గ్రామ సర్పంచ్ రవి యాదవ్ అన్నారు. బుధవారం నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల గ్రామంలో సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి సభ్యురాలు కల్లి మునిసా, మండల అధ్యక్షులు మురళి కృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షులు పబ్బతి జ్యోతి రవికుమార్ హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. పోటీలలో మండల స్థాయి పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు పోటా పోటీగా నువ్వా నేనా అన్న రీతిలో ఆడడం జరిగింది. చివరగా అండర్ 17 బాల్ బ్యాట్మెంటన్ విజేతగా కొణిదెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలవగా వారికి సర్పంచ్ రవి యాదవ్ ఆధ్వర్యంలో బహుమతిగా కప్పును అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజశేఖర్ బాబు, స్పోర్ట్స్ విభాగం సెక్రెటరీ శ్రీనాథ్ పేరు మల్ల, నంద్యాల షాప్ కోఆర్డినేటర్ స్వామి దాసు రవికుమార్, మండల స్థాయి విద్యార్థులు , విద్యార్థినీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img