Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

డ్రోన్ టెక్నాలజీ తో వ్యవసాయ పంటలకు పిచికారి

విశాలాంధ్ర – జెఎన్టియుఏ : డోన్ టెక్నాలజీతో వ్యవసాయ పంటలకు పిచికారి భారాన్ని తగ్గించి పంటల సంరక్షణ చేపట్టి అన్నదాతలకు చేయూతను ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు వీసి ఆచార్య జింక రంగ జనార్ధన్, రిజిస్ట్రార్ ఆచార్య సి. సిధర్ పేర్కొన్నారు. శుక్రవారం జెఎన్టియు విశ్వవిద్యాలయం, ఐఐఐ టి డిఎం, ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రోన్ టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానం వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులతో అన్నదాత కన్నీరు పెట్టకుండా.. డ్రోన్ సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు చేరువచేసి పంట పర్యవేక్షణ, తెగులు నియంత్రణ, నీటి పారుదల, విశ్లేషణ , అధిక దిగుబడును రైతులు సాధించవచ్చునని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహకారాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. డైరెక్టర్లు బి. ఈశ్వర్ రెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య యస్.వి.సత్యనారాయణ , వైస్ ప్రిన్సిపాల్ అరుణ కాంతి , సమన్వయ కర్తలు కే. కళ్యాణి రాధా , డి. విష్ణు వర్ధన్ , కే.వి. ఈశ్వర్ మూర్తి , పిఆర్ఓ రామశేఖర్ రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img