ఆలయ ట్రస్ట్, ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కోట బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వెన్న ముద్దల వేణుగోపాలస్వామి ఆలయములో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈనెల ఏడవ, ఎనిమిదవ తేదీలలో అంగరంగ వైభవంగా రెండు రోజులు పాటు ఆలయ ట్రస్టు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు గురువారం ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకములను వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించారు. తొలుత ఉదయం స్వామివారికి గోవిందా పట్టాభిషేకంతో పాటు మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి ఉయ్యాలో సభ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించగా, ఈ కార్యక్రమం భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉదయము ప్రసాద దాతలుగా తీర్థాల కృష్ణకుమారి, ఉయ్యా లోత్సవ ఉభయ దాతలుగా కాటం లక్ష్మీనారాయణ, కాటం రామకృష్ణ, కాటం, వీరనారాయణ, కాటం పవనజ్ కుమార్-భాగ్యలక్ష్మి మెడికల్స్ ధర్మవరం, రాత్రి ప్రసాద దాతలుగా టెంపుల్ స్టోర్స్, ఉయ్యా లోత్సవ ఉభయ దాతలు నిర్వహించారు. భక్తాదులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా అన్ని ఏర్పాట్లను ట్రస్టు కమిటీ సభ్యులు నిర్వహించారు. శుక్రవారం నాడు కల్యాణోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శేషగిరిరావు, సభ్యులు సుదర్శన, తీర్థాల వెంకటరమణ, సత్యనారాయణ, అశ్వత్ నారాయణ, ప్రసాదు, ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు శేష సాయి, కార్యదర్శి తీర్థాల వెంకటరమణ, కోశాధికారి సుమంత్ కుమార్, డైరెక్టర్లు సత్యనారాయణ రావు, రామారావు, లక్ష్మీనారాయణ, దేవత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.