విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణం లోని పాతపేట ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.సీతా రాముల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తినిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు యేళ్ళ ఉమామహేశ్వర్, ట్రెజరర్ గుండారపు వెంకటరమణ, కార్యదర్శి ప్యారం భరత్, గౌరవ అధ్యక్షులు చిన్నపోల వెంకటేశులు, మరియు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు