విశాలాంధ్ర, పెద్దకడబూరు :ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని వైకాపా రాష్ట్ర యువనాయకులు ప్రదీప్ రెడ్డి అన్నారు . శనివారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ఈఓఆర్డి జనార్ధన్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అర్హుత ఉండి పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకోరావాలని తెలిపారు. బిసి కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే కరెంటు స్తంభాలు కావాలని కాలనీ వాసులు ప్రదీప్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, వైస్ ఎంపీపీ ఇర్ఫాన్ దేశాయ్, సర్పంచ్ ఇస్మాయిల్, నాయకులు రవిచంద్రా రెడ్డి, గజేంద్రరెడ్డి, విజయేంద్ర రెడ్డి, పూజారి ఈరన్న, చంద్రశేఖర్, సత్యగౌడ్, విజయ కుమార్, నర్సింగప్ప, విద్యాకమిటి చైర్మన్ నాగేష్, ఉచ్ఛప్ప, వైస్ చైర్మన్ చిన్న తిక్కన్న, లక్ష్మన్న, జాము మూకన్న, ముక్కరన్న, అర్లప్ప, షేర్ ఖాన్, ఆర్ ఐ మహేష్, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ లు మల్లయ్య, వేణు గోపాల్, గోవిందు, సాయికుమార్, ఏపీవో రామన్న, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.