Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయండి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు

విశాలాంధ్ర-గుంతకల్లు : ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధోనిముక్కల, మల్లనపల్లి, పులగుట్టపల్లి తదితర గ్రామాలలో మంగళవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు సిపిఐ నాయకులు రైతు సమస్యలపై చేపట్టిన కార్యక్రమం పై రైతన్నలకు కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా బి.గోవిందు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు పదివేలు సాగు సాయం మన ప్రభుత్వం ఇవ్వాలని బ్యాంకుల్లో రైతులు తీసుకున్నటువంటి అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాము రాయల్ ,సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ ,పట్టణ సహాయ కార్యదర్శి కార్యదర్శి ఎస్ఎండి గౌస్, రైతు సంఘం నియోజకవర్గ నాయకులు రామాంజనేయులు, ఉమ్మర్ భాష ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img