Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

భరోసాగా జీవించండి… పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం, తదితర కారణాలతో జిల్లాలో మృతి చెందిన పోలీసు అధికారులు మరియు సిబ్బంది కుటుంబాలతో ఎస్పీ బుధవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు.
ఆయా కుటుంబాల సభ్యులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. క్షేమ సమాచారాలు, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుండీ అందాల్సిన ప్రయోజనాలపై సమీక్ష చేశారు. ఎస్పీ మాట్లాడుతూ…
జిల్లాలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుండీ కానీ అంతకు ముందు కానీ కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ కారణాలతో చనిపోవడం బాధకల్గించింది అన్నారు.ఆయా కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా జాప్యం లేకుండా ప్రయోజనాలు అందజేస్తున్నాం అని పేర్కొన్నారు.
కారుణ్య నియమకాల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.
కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆ నష్టాన్ని పూడ్చకపోవచ్చు కానీ ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.మీరు ఎప్పుడూ పోలీసు కుటుంబమే అనే సంకల్పంతో భరోసాగా ఉండాలని… అందుకు అనుగుణంగా పోలీసుశాఖ సేవలు అందిస్తుందన్నారు.
అనంతరం దివంగత సి.ఐ ఆనందరావు కుటుంబ సభ్యులకు మరియు ఏ.ఆర్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెరో రూ. ఒక లక్ష ప్రకారం రూ. 2 లక్షల విలువ చేసే చెక్కులను ఎస్పీ అందజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ్, ఆర్ ఐ రాముడు, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి శంకర్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ మరియు జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, సావిత్రమ్మ మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img