: జిల్లా కలెక్టర్ యం.గౌతమి
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యం.గౌతమి ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామంవద్ద ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్శిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అనంతపురం – తాడిపత్రి హైవే నుంచి యూనివర్సిటీకి రెండు వరసల రహదారి నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. యూనివర్సిటీ నుంచి వెళ్లే ఇరిగేషన్ పరిధిలోని హెచ్ఎల్సి కాలువలు భవన నిర్మాణాలకు అడ్డం రాకుండా, పొలాలకు సక్రమంగా నీరు వెళ్లేలా యూనివర్సిటీ పక్కనుంచి కాలువలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. యూనివర్సిటీకి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపించాలన్నారు. యూనివర్సిటీలో చదవనున్న 15,000 మంది విద్యార్థులకు మంచినీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిడ్ పెన్నార్ నుంచి ప్రత్యేకంగా ఒక పైప్లైన్ లేదా కెనాల్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. భవనాల నిర్మాణం కూడా సకాలంలో పూర్తిచేసేలా చూడాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనుమాన్ కెనడి, సిపిడబ్ల్యుడి ఈఈ శ్రీనివాస్, ఎపిఎస్పీడీసిఎల్ ఎస్ఈ సురేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇషాన్ బాషా, హెచ్హెల్సి ఎస్ఈ రాజశేఖర్, ఏపీఎస్సిఆర్ఐసి ఈఈ ప్రభాకర్ రెడ్డి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ పుణ్యవతి, తదితరులు పాల్గొన్నారు.