Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి దశల వారి ఆందోళనలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ తాసిల్దార్ కార్యాలయం నందు గురువారం వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన మా డిమాండ్లను పరిష్కరించే దిశగా లేనందున 20 ,21వ తేదీలలో మండల కేంద్రాల్లో దీక్షలు
ఆగస్టు 7 ,8 తేదీలలో కలెక్టరేట్ల వద్ద దీక్షలు
ఆగస్టు 23 ,24 తేదీలలో విజయవాడలో రాష్ట్రస్థాయి దీక్షలు
ఆగస్టు 25వ తేదీన జగనన్నకు నేరుగా చెబుదాం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తాసిల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లను తెలియజేస్తూ వీటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వము ముందుకు రావాలని లేకపోతే దశలవారీగా ఉద్యమాలు చేస్తామని మా యొక్క డిమాండ్లు పే స్కేల్ అమలు చేయాలని నామినేల్గా పనిచేస్తున్న వారందరిని విఆర్ఎల్ గా నియమించాలని అర్హులకు విఆర్ఓ అటెండర్ వాచ్మెన్ ప్రమోషన్లు ఇవ్వాలని డిఏ రికవరీ నిలిపివేత బిఎతో కూడిన వేతనం అమలు చేయాలని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఒక రూపాయి వేతనం కూడా పెంచలేకపోవడం శోచనీయమని కావున డిమాండ్లో పరిష్కారం దిశగా మా డిమాండ్లపై పోరాటం నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంజనప్ప, సుబ్బరాయుడు, నరసప్ప, గోవిందప్ప ,తిమ్మయ్య ,పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img