విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఁ భారతదేశంలో సుపరిపాలన – విధానాలుఁ అనే అంశం పై బుధవారం అంతర్జాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రధానవక్తగా భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి, వి.శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఁగత కొంతకాలంగా భారత ప్రభుత్వము సుపరిపాలన వైపు అడుగులు వేస్తుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తుందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పరిపాలనా విధానాలను మార్చడంలో భారత ప్రభుత్వం సఫలీకృతం అయ్యింది అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ఏ.కోరి, డీన్ ఆచార్య జి. రామ్ రెడ్డి, సదస్సు నిర్వాహకులు డా. బాబు గోపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.