విశాలాంధ్ర-రాప్తాడు : మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలుకు పంపడంతో రాప్తాడు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం రూరల్ డిఎస్పి వెంకట శివారెడ్డి ఇటుకలపల్లి నరేంద్రరెడ్డి, ఎస్సైలతో కలిసి సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎస్కేయూ, రాప్తాడు, అనంతపురం రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతపురం రూరల్ మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రహదారుల పైకి వచ్చి ఆందోళనలు రాస్తారోకాలు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.