Friday, April 19, 2024
Friday, April 19, 2024

కార్మిక చట్టాల పరిరక్షణకు పోరాటాలు

మే డే ఉత్సవాల్లో జాఫర్ పిలుపు

విశాలాంద్ర – కళ్యాణదుర్గం : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల కబంధహస్తాల్లో కార్మిక చట్టాలు నలిగిపోతున్నాయని, వాటిని పరీక్షించుకోవడమే ధ్యేయంగా కార్మిక, కర్షక సంఘాలు పోరాటం చేయాల్సి ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా కళ్యాణదుర్గంలో ఆర్టీసీ డిపో ఎదుట అరుణ పతాకాన్ని ఎగురవేసిన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ అధ్యక్షతన జరిగిన మే డే సంబరాలకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు ఆర్టీసీ టెన్త్ క్లాస్ యూనియన్ జిల్లా నాయకులు ఖాన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ 137 ఏళ్లుగా కార్మికులు సాధించుకున్న చట్టాల పరిరక్షణతో ముందుకు సాగుతున్నారని 44 చట్టాలను కాపాడుకుంటూ, ఎనిమిది గంట ల పని విధానాన్ని అమలుపరచుకున్నారన్నారు . కర్షకులకు మూడు నల్ల చట్టాలను తెచ్చి కేంద్రoలోని బిజెపి ప్రభుత్వం దేశంలో ఎన్ని అన్నదాతలను ఇబ్బందుల్లోకి పట్టిందని మండిపడ్డారు. అయితే ఏడాది పాటు రైతులు సమిష్టిగా పోరాటాలు చేసి చట్టాలను రద్దు చేయించిన ఘనత సాధించుకున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటి తెచ్చి రైతు హక్కులను హరిస్తుందన్నారు . అన్ని రకాల ధరలు పెంచి నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అల్లంత దూరంలో చేసిందన్నారు. ముఖ్య మంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వేల కోట్ల మద్యం ఆదాయాన్ని సమకూర్చుకున్నాడని, అని గుర్తు చేశారు. రాబోవు రోజుల్లో నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి లకు అధికారం నుండి గద్దె దింపడానికి కార్మిక కర్షక శక్తులను ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు మేడే ఉత్సవాల్లో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి మసీద్ సర్కిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారులు మే డే పాటలతో అలరించారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు ఆంజనేయులు ఓంకార్ నరసింహులు రఘువీరా తిలక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img