Friday, March 31, 2023
Friday, March 31, 2023

కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత

ఆసుపత్రిని సందర్శించిన ఏఐవైఎఫ్ నాయకులు

విశాలాంధ్ర – టెక్కలి: మండలం లోని పోలవరం బీసీ హాస్టల్లో సోమవారం 27 మంది విద్యార్థులకు ఆహారం విషమించడం వలన విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. సోమవారం ఉదయం 7 గంటలకు టిఫిన్ తిన్నాకే విద్యార్థులంతా ఒక్కసారిగా అస్వస్థత లోనైనట్లు తెలిసింది. ఈ విషయంపై ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి M. యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి K. శ్రీనివాస రావులు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించి విషయం తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో తరచూ బీసీ, ఎస్సీ హాస్టల్స్ లో ఇలాంటి సంఘటనలు పదేపదే పునరావతం అవ్వడం జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థులు ఉంటున్న హాస్టల్స్ లో ఆహార పదార్థాలు నాణ్యత లోపించడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పై విషయం ప్రభుత్వం చర్యలు తీసుకుని నాణ్యమైన బియ్యం ఇతర ఆహార పదార్థాలు హాస్టల్ కు సరఫరా చేయాలని అఖిలభారత యువజన సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీలు వేసి హాస్టల్ ను సందర్శించి పర్యవేక్షించాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img