Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

జాతీయస్థాయి కరాటే లో బ్లూ మూన్ విద్యాసంస్థ విద్యార్థుల హవా

విశాలాంధ్ర – కదిరి : జాతీయ స్థాయి కరాటే పోటిల్లో బ్లూ మూన్ విద్యా సంస్థ విద్యార్థులు సత్తా సాటినట్లు కరాటే మాస్టర్ షక్షావలి తెలిపారు.కర్నూల్ ఎస్ ఎల్ఎన్ గార్డెన్ లో ఆర్గనైజర్ జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో కట, కుమిత విభాగల్లో కటా విభాగంలో , చందన శ్రీ గోల్డ్ మెడల్, షరణి సిల్వర్ మెడల్, సాత్విక్ బ్రాంజ్ మెడల్ సాధించగా,కుమిత్ విభాగంలో రాహుల్ బ్రాంజ్ మెడల్ సాధించాడు.ఉమెన్స్ ఓపెన్ కుమితే ( ఫైట్ ) గ్రాండ్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ బ్లూ మూన్ జూనియర్ కాలేజీ సిరి కైవసం చేసుకుంది. కాలేజీ విద్యార్థిని లు కుమిత్ విభాగంలో నికిత గోల్డ్ మెడల్ సాధించగా,కట విభాగంలో సిరి గోల్డ్ మెడల్ , నికిత బ్రాంచ్ మెడల్ సాధించారు.చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ బ్లూ మూన్ విద్యాసంస్థలో విద్యతో పాటు క్రీడా, కళా రంగాల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్టు, విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజీ లేకుండా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు ఉపాధ్యాయులు మాధవరెడ్డి, సురేంద్రరెడ్డి,పి ఈ రామంజులరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img