Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి : జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సూచించారు. మంగళవారం బ్రహ్మసముద్రం మండలంలోని పిల్లలపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించడం జరిగింది. పిల్లలపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించేందుకోసం వచ్చిన ప్రతిపాదనల మేరకు పాఠశాలను జెసి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు -నేడు పనులను పరిశీలించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బాలకిషన్, ఎంపీడీవో దాసా నాయక్, ఎంఈఓ, ఎంపీపీ, సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img