Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

చంద్రయాన్- 3 విజయవంతం పై ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

విశాలాంధ్ర – ధర్మవరం: ఇటీవల చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో పట్టణంలోని సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జాతీయ జెండాలను చేతన పట్టుకొని ర్యాలీ నిర్వహిస్తూ జై భారత్ అన్న నినాదాలు హోరెత్తించాయి. తొలుత విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి ల చేత కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయం భారతదేశ కీర్తిని స్పూర్తింపజేసిందని, ప్రపంచ దేశాల కు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. ప్రతి విద్యార్థి దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశం నాకేమీ ఇచ్చింది అనుకోకుండా దేశానికి నేను ఏమి చేశాను అన్న స్ఫూర్తితో అందరూ జీవితంలో ముందుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నరేంద్రబాబు, డైరెక్టర్ రఘునాథ్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img