విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ .బి .దేవి అధ్యక్షతన కార్యాలయం సమావేశ భవనం నందు జిల్లా యందు వుండు 11 ప్రవేట్ పారామెడికల్ ట్రయినింగ్ కాలేజీ లనందు వుండు వివిధ కోర్స్ లలో అప్లై చేసిన విద్యార్థిని ,విద్యార్థులకు. కౌన్సెలింగ్ ద్యారా మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఈ బి .దేవి మాట్లాడుతూ… వివిధ పారామెడికల్ కోర్స్ ల నందు అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు.మంచి నైపుణ్యం తో విద్యను అభ్యసించాలని మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటావని ,ప్రజల ప్రాణాలకు సంబందించిన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా .చెన్నకేశవులు. పరిపాలన అధికారి గిరిజ మనోహర్ రావు , సూపరిండెంట్ విజయ భాస్కర్ రెడ్డి , ఎస్సి. సోషియల్ వెల్ఫేర్ సూపరిండెంట్ రవికాంత్ , సీనియర్ అసిస్టెంట్స్ , సురేష్, కమలాకర్ రాజు, పాల్గొన్నారు.