విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ పరిపాలన అధికారినిగా(డీఏవో) పి. సుబ్బలక్ష్మమ్మ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఉన్న రమేష్ బాబు పదవి విరమణ పొందడం, అనంతరం డిఏఓ ఇన్చార్జిగా గతంలో ఉన్న అంపయ్య ద్వారా చార్జ్ తీసుకోవడం జరిగింది. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది డిఏఓ కు పుష్ప గుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుబ్బలక్ష్మి అమ్మ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రజలు రైతుల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చేస్తానని తెలిపారు. ఆర్డిఓ, కార్యాలయ అధికారులు, సిబ్బంది ల సహాయ, సహకారములతో మంచి గుర్తింపు కార్యాలయమునకు వచ్చేలా, తన విధులు నిర్వర్తిస్తారని తెలిపారు.