విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం : పీవీకేకే పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న మెకానికల్ , ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల బుధవారం జే సి బీ గోల్డ్ ఫీల్డ్ ప్రై.లి. నిర్వహించిన నియామకాల్లో 16 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ వైభవ్ తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వివిధ విభాగాలలో సర్వీస్ ట్రైనీ , సర్వీస్ ఇంజినీర్ గా నియమిస్తారని, శిక్షణా సమయంలో వసతి భోజన సదుపాయాలతో పాటు నెలకు 10 వేల రూపాయలు ఇస్తారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, ప్రిన్సిపల్, సంస్థ ప్రతినిధులు సారధి, హెచ్ ఆర్ మేనేజర్ , విజయ భాస్కర్, జోనల్ మేనేజర్, మెకానికల్ విభాదాధిపతి జయ లక్ష్మి అభినందనలు తెలిపారు.