విశాలాంధ్ర- జేఎన్టీయూ ఏ : సమాజంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లకు సాంకేతిక ఆవిష్కరణలతో దేశ ప్రగతి ఫలాలను అందించేందుకు కృషి చేయాలని ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్ధన్, రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక మీద సదస్సును కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విద్యార్థులు నవ్యవిష్కరణలు చేయడంతో పాటు పేటెంట్ హక్కులను , నిధులను సాధించాలన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. సదస్సులు వల్ల విద్యార్థుల తాము ఆశించిన విజ్ఞానాన్ని అందరికీ పంచుకోవడంతోపాటు ఆవిష్కరణలో ఎదురవుతున్న ఎన్నో సమస్యలకు కొత్త మార్గాలను అన్వేషించేందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. భవాని , మెకానికల్ విభాగ్యపతి కె. కళ్యాణి రాధ , కోఆర్డినేటర్ డా బి. ఓం ప్రకాష్ , ఈ ఈ ఈ ఆచార్య యన్. విశాలి , కోఆర్డినేటర్ జె. శ్రీనివాసులు , డా యం. అంకారావు , ఈసీఈ విభాగ అధిపతి డి. విష్ణు వర్ధన్ , కోఆర్డినేటర్ లలిత కుమారి , సిఎస్ ఈ కె. మాధవి , కోఆర్డినేటర్ కె.యఫ్. భారతి , బి. లలిత , కెమికల్ విభాగం బి. దిలీప్ కుమార్ , కోఆర్డినేటర్ యస్. శారద గారు , యూనివర్సిటీ డైరెక్టర్లు, భోధన, భోధనేతర విద్యార్థులు పాల్గొన్నారు.