Friday, March 31, 2023
Friday, March 31, 2023

సమస్యల పరిష్కార గళాలకు మద్దతు ఇవ్వండి

విఘ్నులారా ఆలోచించండి
పదవులు అలంకారాలు కాదు

విశాలాంధ్ర – తనకల్లు ప్రశ్నించి సమస్యలను పరిష్కరించే గలాలకు మద్దతిచ్చి శాసనమండలికి పంపిద్దామని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జేవి రమణ మండల కార్యదర్శి ఇక్బాల్ తదితరులు మండల కేంద్రంలోని గోవింద నరసింహారెడ్డి జూనియర్ కళాశాల తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ప్రశ్నించే గొంతుకులకు అవకాశం ఇద్దాం అన్నారు మన సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై రైతు సమస్యలపై పోరాడే పిడిఎఫ్ అభ్యర్థులైన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కత్తి నరసింహారెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజుకి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేయించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకొని పదవులలో బానిసత్వాన్ని రూపుమాపల్సిన అవసరం ఉందన్నారు నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలం చెంది ఎన్నికల ముందు మాయమాటలు చెబుతున్నారని, సమాజంపై అవగాహన లేని ప్రజలు ప్రలోభాలకు మాయమాటలకు లోన్ అవుతారని ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని మనకు మన సమస్యలపై పోరాడే నాయకులను ఎన్నుకొని సమ సమాజ నిర్మాణానికి నాంది పలకాలన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు చౌడప్ప యాదవ్ మండల సహాయ కార్యదర్శి కరీముల్లా రైతు సంఘం నాయకులు రెడ్డప్ప రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img