Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

సూర్య ప్రభ, అశ్వ వాహనాలలో ఊరేగిన శ్రీ లక్ష్మి వేంకటేశ్వరుడు

ఆలయ అభివృద్ధి కమిటీ

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు సప్త దశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ అభివృద్ధి కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్తత జ్ఞానబోధ సభా ట్రస్ట్, అర్చకుల, భక్తాదులు, దాతలు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐదవ రోజు విశ్వకేశన ఆరాధన, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, ధ్వజ కుంభ పూజ, నిత్య ,శాంతి మూల మంత్ర హోమాలు, పరివార హవనము, విశ్వకేశన ఆరాధన, తదితర కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అర్చకులు సుదర్శన ఆచార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు, వారి శిష్య బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనము రాత్రి అశ్వ వాహనములలో వెంకటేశ్వర స్వామి పట్టణ పురవీధులలో ఊరేగించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ తిరుమల తిరుపతిలో నిర్వహించే పద్ధతిలో అర్చకులు నిర్వహించారు. అనంతరం భక్తాదులందరికి వేడుకలు కన్నుల పండుగగా భక్తాదులు, దాతలు, కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడంలో అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాహన దాతలు జగ్గా చంద్రకళ,జగ్గా సాయిశివరాం, జగ్గా మౌనిక, మంచు కుండి మంజువాణి,కీర్తిశేషులు గాదంశెట్టి ప్రకాష్ గుప్తా లా పేరిటన అర్చకులు ప్రత్యేక పూజలు వనర్చి, వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అర్చకులు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి పాంచ రాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కమిటీ సభ్యులు మెటికల కుల్లాయప్ప, దత్త శివ, బిల్లే నాగప్ప, సాగా సురేష్, శంకర సంజీవులు, రంగా శీనా, గుద్దిటి రామాంజనేయులు, బాల, నాగేంద్ర, స్వామివారి వాలంటీర్స్, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img