Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

అక్కల్కోట్ మహారాజ్ ఆరాధన కరపత్రం విడుదల

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : స్థానిక హెచ్ఎల్సీ కాలనీలోవలి ఆశ్రమం నందు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు 145వ ఆరాధన మహోత్సవ ఆహ్వాన పత్రికను కార్యవర్గ సభ్యులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 18వ తేదీన ఆశ్రమంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నగర సంకీర్తన గణపతి పూజ రుద్రాభిషేకం, సత్య దత్త వ్రతం, అనంతరం స్వామివారి చిత్రపటం సాయంత్రం నవరోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలన్నారు కార్యక్రమంలో .కార్యవర్గ సభ్యులు జయచంద్ర రెడ్డి రాంభూపాల్ రెడ్డి నాగ ప్రసాద్ వెంకట్ నారాయణ మోహన్ రాజు శివమ్మ నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img