విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా శుక్రవారం శ్రీనివాసులు నిరాడంబరముగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన చేత మార్కెట్ యార్డ్ కార్యదర్శి ప్రమాణస్వీకారం చేయించారు ఆయనతో పాటుగా డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శంకర్నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ మండల కన్వీనర్లు మండలాధ్యక్షులు జిల్లా పరిషత్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులో ఉంచి యార్డును లాభాల బాటలోకి తీసుకురావాలని ఆయన కోరారు ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.