Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఫార్మసీలో సిలబస్ మార్పు

విశాలాంధ్ర- జె ఎన్ టి యు ఏ : జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలో అనుబంధ ఫార్మసీ కళాశాల లో సిలబస్ మార్పులకు ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్దన్ శ్రీకారం చుట్టారు. గురువారం పరిపాలన భవనంలోని సెమినార్ హాల్లో ఫార్మసీ బోర్డ్ అఫ్ స్టడీస్ మీటింగ్ వీసి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ .. ఫార్మసీ రెగ్యులేషన్స్ లో హానర్స్ లేక రీసెర్చ్ డిగ్రీలను, రెగ్యులర్ డిగ్రీతో పాటు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. ఈ డిగ్రీలను పొందాలంటే అదనంగా 12 క్రెడిట్ లను సాధించాలని తెలిపారు. ఈ సిలబస్ లో నాలుగు ప్రొఫిషనల్ ఎలక్టివ్స్ ను, రెండు ఓపన్ఎలాక్టివ్స్ ను , స్కిల్ ఓరిఎంటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నామని, క్రెడిట్ ట్రాన్స్ పర పాలసీని , రెండు సమ్మర్ ఇంటర్నేషిప్ లను రెండవ సంవత్సరం , మూడవ సంవత్సరం చివరిలో చెయ్యాలని, వీటికి ఎనిమిది వారాల వ్యవధిని ఇస్తామని తెలిపారు. వీటితో పాటు ఆడిట్ కోర్సులను కంప్లీట్ చెయ్యాలని తెలిపారు. హానర్స్ మరియు రీసెర్చ్ డిగ్రీ రిజిష్టర్ చేసుకోవడానికి రెగ్యులర్ డిగ్రీలో మూడవ సెమిస్టర్ వరకు 7 సి గి పి ఎ సాధించిన విద్యార్థులు అర్హత సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఏ పి ఆచార్య వి. సుమలత , రెక్టార్ ఆచార్య యం.విజయ కుమార్ గారు, డి ఈ ఆచార్య ఇ. కేశవ రెడ్డి , బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మెన్ ఆచార్య యాన్. దేవన్న , మెంబర్లు ఆచార్య ఆశిత్ కుమార్ చక్రవర్తి ఐఐటీ, రోపర్ (పంజాబ్), డాక్టర్ రామకృష్ణ , సి ఎస్ ఆర్ ఐ , హైదరాబాద్ డాక్టర్ యం. సునీత రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img