Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు గైకొనండి..

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, డివిజన్ అధ్యక్షులు శివ
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగంగా ప్రచారం నిర్వహిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్లోబల్ స్కూల్ కాలేజీలపై విని వెంటనే చర్యలు గైకొనాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతలయ్య, డివిజన్ అధ్యక్షులు శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణం లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ, ఫ్లెక్సీలను చింపి వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇష్టానుసారంగా బహిరంగంగా ఫ్లెక్సీలో ప్రచారంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గ్లోబల్ స్కూల్ యాజమాన్యం వారు ధర్మవరంలో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలను అమర్చి అక్రమ అడ్మిషన్లకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. ఈ విషయాన్ని గతంలో ఎంఈఓ కు తెలిపిన కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరి అయిన పద్ధతి కాదని తెలిపారు. ఇలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వారు బహిరంగ ప్రచారాలు చేయడం వల్ల,ప్రభుత్వ విద్యకు తూర్పు పొడిచేలా ఈ ప్రచారం పాల్పడడం దారుణం అన్నారు. ఈ అక్రమ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేయకపోతే పేద విద్యార్థులకు అందని ద్రాక్షలా విద్యావ్యవస్థ తయారవుతుందని తెలిపారు. ఎంఈఓ సుధాకర్ నాయక్ పలుమార్లు తెలిపిన కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో? సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇకనైనా ఎంఈఓ అడ్డుకట్ట వేయకపోతే,మున్ముందు ఎంఈఓ కార్యాలయమును ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయవర్ధన్, అజయ్, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img