Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నారా లోకేష్, చంద్రబాబు, అచ్చం నాయుడు పై చర్యలు తీసుకోండి

విశాలాంధ్ర-రాప్తాడు : టీడీపీలో పదవులు పొందాలంటే అధిక కేసులు ఉండాలని నాయకులను, కార్యకర్తలను రెచ్చగొడుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసు కేసులు నమోదు చేయాలని వైసీపీ సత్యసాయి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ షాషు (షాషావలి)అనంతపురం రూరల్ పోలీస్ స్టేషనులో రూరల్ స్టేషన్ సీఐ జి.రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు శనివారం ఫిర్యాదు చేశారు. జిల్లా కన్వీనర్ షాషావలి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘథం కలిగించే విధంగా ఆయన ప్రసంగాలను చేస్తున్నాడని… అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభలలో పార్టీ నాయకుల్ని, కార్యకర్తలే కాకుండా ప్రజలను కూడా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం దారుణమన్నారు. తంబళ్లపల్లి, పుంగనూరు మాచర్ల లాంటి సున్నితమైన నియోజకవర్గాల్లో అల్లర్లు జరగటం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. ఇటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక గొడవలకి దారితీస్తుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ సోషల్ మీడియా కో- కన్వీనర్ చంద్రశేఖర్, రూరల్ మండలం జేసీఎస్ ఇంచార్జి శ్యాంసుందర్ శాస్త్రి, రామగిరి మండల కన్వీనర్ రమేష్, నాయకులు ధనుంజయ యాదవ్, పేరూరు మోహన్, రూరల్ మండల కో- కన్వీనర్లు ఇర్ఫాన్, మనోజ్ పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img