Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి.. ఏఐఎస్ఎఫ్ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములో గల ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా వసూలు చేస్తున్నారంటూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్థానిక ఎంఈఓ సుధాకర్ నాయక్ కు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటి, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ టెక్నో, లాంటి పేర్లను రాయరాదని అది చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వారు తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెనివెంటనే కఠిన చర్యలు గైకొనాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో ఫీజు స్ట్రక్చర్ కమిటీని ఏర్పాటు చేసి, నోటీస్ బోర్డులో ఫీజు యొక్క వివరాలను తల్లిదండ్రులకు సమాచారం అందేలా ఉండాలని వారు తెలిపారు. తల్లిదండ్రులు తమ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అధిక ఫీజు దోపిడీలు కాకుండా వారికి న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాకుండా కొన్ని ప్రైవేటు స్కూళ్లలో అగ్నిమాపక అనుమతి లేకోకుండా ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా, ఇదేచ్ఛగా ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యం నడుస్తున్నాయని, భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. ప్రతి పాఠశాల సొంత బిల్డింగులు కాకుండా కమర్షియల్ బిల్డింగుల్లో పాఠశాల నడుపుతున్నటువంటి పాఠశాల యాజమాన్యం పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. చర్యలు గైకొనని యెడల ఎంఈఓ ఆఫీస్ ముట్టడికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ ,రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img