Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర తాడిపత్రి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న గ్రంధాలయంలో శనివారం గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడు ఆధ్వర్యం లో వేసవి విజ్ఞాన శిబిరాలు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాలు శాఖా గ్రంథాలయంలో ఈనెల 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు నిర్వహిస్తు న్నారన్నారు. వేసవి సెలవులను ఎలాంటి ప్రణాళిక లేకుండా వదలి వేస్తే క్షణాల్లో సెలవులు వృథాగా ఆవిరి అయిపోతాయి. విద్యార్థిని విద్యార్థులారా ఆలోచించండి మీ తాడిపత్రి శాఖా గ్రంథాలయంలో నిర్వహిం చబడే వేసవి శిబిరాలలో పాల్గొని గ్రంథాల యంలో గల కథల పుస్తకాలు మహాను భావుల జీవిత చరిత్రలు, సైన్స్ , క్విజ్ పురాణాలు, చరిత్ర వంటి అనేక రకములైన పుస్తకాలను చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. క్యారం బోర్డ్, చెస్ లాంటివి కూడా ఉంటాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ వేసవి సెలవులలో గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు. అనంతరం గోడపత్రిక విడుదల చేశారు. విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img