నౌ జవాన్ సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కొత్తపేట లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు నౌ జవాన్ సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, తొపీక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం కిమ్స్ సవేరా హాస్పిటల్స్ సహకారంతో ఈ శిబిరంలో జిఆర్బిఎస్/ బిపి/ఈసీజీ/ 2సఱ- ఎకో నిర్వహిస్తామని తెలిపారు. గుండె నొప్పి, ఛాతి నొప్పి, గుండె దడ, ఆయాసము, కళ్ళు తిరగడం, గుండెలో మంట కలగడం, చాతి బరుగుగా ఉండడం, కాళ్లు వాపు రావడం,చెమటలు పట్టడం లాంటి సమస్యలకు చక్కటి వైద్య చికిత్సలను నిర్వహిస్తామని తెలిపారు. శిబిరమునకు వచ్చువారు ఆధార్ కార్డు జిరాక్స్ తో రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ భారీ, ఇస్మాయిల్, త, అమిర్ భాష తదితరులు పాల్గొన్నారు.