వాసవి క్లబ్ ఆసుపత్రి అధ్యక్షులు. ఓలిగ నాగ
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల విద్యుత్ ఆఫీస్ ఎదురుగా గల వాసవి క్లబ్ ఆసుపత్రిలో ఈనెల 29వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ అధ్యక్షులు ఓలిగ నాగ, కార్యదర్శి మోకా రవి, కోశాధికారి తక్కశిల లలిత్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం కిమ్స్ సవేరా హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో ఈ శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో గుండెనొప్పి, చాతినొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్ళు తిరగడం, గుండెలో మంట, చాతి బరువుగా ఉండడం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలకు చక్కటి వైద్య చికిత్సలతో పాటు సలహాలు కూడా వైద్యులచే ఇవ్వబడును అని తెలిపారు. అదేవిధంగా జి ఆర్ బి ఎస్/ బి పి/ ఈ సి జి/ 2డి ఏకో కూడా ఉచితంగా నిర్వహించబడును అని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని గ్రామ, పట్టణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.