డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియా
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని సాయి నగర్-సాయిబాబా గుడి దగ్గర గల స్పందన హాస్పిటల్ లో ఈనెల 13వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంట వరకు ఉచిత సంతాన సాఫల్య పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు స్పందన హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతానం లేని వారికి ఇదొక చక్కటి అవకాశం అని, మీ ఆశలను, శాస్త్ర విజ్ఞానము, అనుభవము, నైపుణ్యముతో సఫలీకృతం చేయడమే మా లక్ష్యం అని తెలిపారు. ప్రముఖ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్. ప్రియాంక రెడ్డి చే వైద్య చికిత్సలను నిర్వహించబడును అని తెలిపారు. ఐవిఎఫ్ ప్యాకేజీలపై 25వేల రూపాయలు తగ్గింపు కూడా ఇవ్వబడుతుందని వారు తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని సంతానం లేని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు సెల్ నెంబర్ 949410055 కు గాని 8500858888కు గాని 7978113533 కు సంప్రదించవచ్చునని తెలిపారు.