Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

పట్టు చీరల బకాయిలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టండి…

పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
విశాలాంధ్ర -ధర్మవరం : ఇటీవల కొన్ని రోజుల కిందట ధర్మవరం వ్యాపారస్తుల నుండి అవినాష్ గుప్తా చీరలను కొనుగోలు చేసి, చీరల డబ్బులు ఇవ్వకపోగా దాడులు చేసి తీవ్రంగా గాయపరిచిన విషయముపై బుధవారం పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఐజి క్రాంతి రానా టాటాను కలవడం జరిగింది. తదుపరి సమస్యలను తెలుపుతూ వినతి పత్రాన్ని కూడా వారు అందజేశారు. అనంతరం ఐ జి గారికి విజయవాడలో గల ఆలయ సిల్క్ శివాని బాకీ వివరాలు కూడా తాము తెలియజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ఐ జి మాట్లాడుతూ మీకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీనియర్ లాయర్లను సంప్రదించి, ఆలయ సిల్క్స్ షాపును సి జ్ చేయించి, తద్వారా మి బాకీలు వచ్చినట్లు చూస్తానని తెలిపారు. తదనంతరం డిఎస్పి విశాలా ఉన్నాను కూడా మా సమస్యలను తెలుపుకోవడం జరిగిందని వారు కూడా న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. తదుపరి ఏసిపి సెంట్రల్ వారికి కూడా మా సమక్షంలోనే మెసేజ్లు కూడా పంపడం జరిగిందని, మరో మూడు రోజులలో పూర్తి వివరాలు ఐ జి కి అందిస్తున్నట్లు వారు తెలిపారు. తప్పకుండా ధర్మవరం చేనేత వ్యాపారస్తులందరికీ కూడా వారికి రావలసిన బకాయిని ఆలయ సిల్క్స్ యజమాని ద్వారా తప్పక ఇప్పిస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో ఏపీ స్టేట్ బిసి అధ్యక్షులు కేశన శంకర్రావు, జిల్లా బీసీ అధ్యక్షులు మహేష్, గిర్రాజు నాగరాజు, సాయి కృష్ణ, పార్థసారథి, పోలా వెంకటరమణ, దత్త శివ, నీలూరి శ్రీనివాసులు, కోటం ఆనందు, సిడి.బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img