Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

క్రీడా పోటీల్లో ప్రభుత్వ కే హెచ్ డిగ్రీ విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఈనెల 20, 21వ తేదీలలో ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్-ఏ క్రీడా పోటీలు లో ధర్మవరం కె హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచారని గురువారం విలేకరులతో వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల్లో గుంతకల్, ఉరవకొండ, ధర్మవరం జట్లు పాల్గొన్నా అని, ధర్మవరం డిగ్రీ కళాశాల విద్యార్థులు గుంతకల్, ఉరవకొండ జట్లను ఓడించి, సెమీఫైనల్ లో ఎస్ ఎస్ బి ఎన్ జట్టుతో తలపడి ఓడించి, ఫైనల్ లో ఆర్ట్స్ కళాశాలలో జరిగిన హోరా హోరి మ్యాచ్లో ఓటమితో ద్వితీయ స్థానంలో నిలిచిందని ధర్మవరం కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టులో కె. దీపక్ కుమార్, డి. వంశీకృష్ణ, ఎస్. మహమ్మద్, కె. వినయ్, పి. రఘురాం సాయి, పి. నాగరాజు, బి. వినయ్, ఎం. జగదీష్, ఎం. చంద్రమోహన్, పి. శ్రీనివాసులు కలరని తెలిపారు. ఇందులో క్రీడల్లో మరింత ఉత్తమ ప్రతిభ కనబరిచిన కె. దీపక్ కుమార్, కే. వినయ్, పి. నాగరాజు లు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ క్రీడాకారుల విద్యార్థులను ప్రిన్సిపాల్ తో పాటు వైస్ ప్రిన్సిపాల్ జీవన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్, అధ్యాపకులు రాబియా బేగం,చిట్టెమ్మ, షమీవుల, కిరణ్ కుమార్, గోపాల్ నాయక్, పావని, భువనేశ్వరి, పుష్పావతి, గౌతమి, రామ్మోహన్ రెడ్డి లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img