విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వం శనివారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పట్టణానికి చెందిన మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల, మున్సిపల్ ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను కనపరచడం జరిగిందని బాలికల పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి,బాలుర హెచ్ఎం పద్మావతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలికల హెచ్ఎం మేరీ వర కుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో 105 మందికి 86 మంది ఉత్తీర్ణత కాగా 82 శాతము నమోదు కావడం జరిగిందని వారు తెలిపారు. ఇందులో టి. ముబ్బసిర 584 మార్కులు, కే. ఉషశ్రీ 568 మార్కులు, ఎం. స్ఫూర్తి 566, జి. నవ్య 563, ఎం ధనుషా 562 మార్కులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం హెచ్ఎం తోపాటు ఉపాధ్యాయ బృందం,బోధ నేతర బృందం విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి బాలుర పాఠశాల హెచ్ఎం పద్మావతి మాట్లాడుతూ తమ పాఠశాలలో 116 మందికి 72 మంది ఉత్తీర్ణతతో 62 శాతం నమోదు కావడం జరిగిందని వారు తెలిపారు. ఇందులో 5 మార్కులు 11 మంది తేవడం జరిగిందని, తదుపరి ఎస్. మా భాష 576 మార్కులు, పి. వినయ్ కుమార్ 573 పి శ్రీనాథ్ బాబు 563 వి. చరణ్ సాయి తేజ 558 మార్కులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తదుపరి హెచ్ఎం తోపాటు అధ్యాపక, ఆధ్యాపాకే తర బృందం విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.