సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి
విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం చాయాపురం గ్రామానికి చెందిన దివంగత సిపిఐ పార్టీ నాయకులు కామ్రేడ్ తమ్మినేని రంగన్న పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు పేద ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తిని సిపిఐ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. రంగన్న ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలందరికీ భూములు పంచాలని ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వాలని రైతులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నో ఉద్యమాలను నడిపిన వ్యక్తిని పేర్కొన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు అండగా నిలిచిన వ్యక్తి తమ్మినేని రంగన్న అని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని పేదల కోసమే అంకితం చేశారన్నారు. ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అంతకముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దివంగత కామ్రేడ్ తమ్మినేని రంగన్న స్వగ్రామం ఛాయాపురంలో ఆయన స్థూపం వద్ద నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివన్న రామాంజనేయులు తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి మనోహర్, ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్షులు చెన్నారాయుడు, కామ్రేడ్ రంగన్న కుమారుడు రాజా, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్ విడపనకల్లు కార్యదర్శి రమేష్, కూడేరు మండల కార్యదర్శి నారాయణమ్మ పార్టీ నాయకులు శ్రీధర్, మల్లేష్,రమణప్ప శ్రీరాములు, నబి సాహెబ్, రాజు, హనుమంతు, చక్రధర్ వన్నూరమ్మ, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు