Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

పార్వతీపురం మాజీఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును పరామర్శ చేసిన టీడీపీ నేతలు

విశాలాంధ్ర – పార్వతీపురం : మాజీ ఎమ్మెల్యే, మాజీ నియోజకవర్గ ఇంఛార్జి బొబ్బిలి చిరంజీవులు ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమచారం తెలుసుకున్న రాష్ట్ర టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ పరిశీలకులు దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి, కిమిడి నాగార్జున,బోయిన గోవిందరాజులు నియోజక వర్గం ఇంచార్జి బోనెల విజయచంద్ర, పాలకొండ ఇంచార్జి నిమ్మక జయకృష్ణ, సాలూరు మాజీ ఎమ్మెల్యే బంజదేవ్, కురుపాం ఇంచార్జి తోయక జగదీశ్వరి,వాడాడ రాము,తదితరులు కృష్ణపల్లి వెళ్ళి పరామర్శ చేశారు.ఈనెల 9నపార్వతీపురం జిల్లాలలో జరగబోయే చంద్రబాబు పర్యటనను కలిసికట్టుగా ఉండి విజయవంతంచేయాలని, అలాగే ఆరోగ్యంను మెరుగు పరుచుకొని పార్టీ కార్యక్రమాలలో ఎప్పటిలాగే పాల్గొని పార్టీని నియోజకవర్గంలో మరింత బలవపేతం చేయాలని కళావెంకటరావు, సంధ్యారాణిలు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img