విశాలాంధ్ర- ఉరవకొండ : టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు నుంచి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంల బయటకు రావాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శనివారం ఉరవకొండ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం, వెంకటేశులు, విజయ భాస్కర్, శ్రీధర్, సుంకమ్మ, గోవిందు, సుంకన్న, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు