Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

ఘనంగా మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం

విశాలాంధ్ర, ఎన్ పీ కుంట : మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవాన్ని మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ సి కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్య అందుకుని గురువులు కంటే ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్ నాయక్, ఉన్నత పాఠశాల హెచ్ఎం శిరీష, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రామ్మోహన్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img