విశాలాంధ్ర ధర్మవరం:: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్న నాయుడుకు ధర్మవరంలో శుక్రవారం నాడు టిడిపి శ్రేణులు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ సత్య సాయి జిరా కేంద్రంలో జరిగే జిల్లాస్థాయి పార్టీ సమావేశానికి వెళుతూ మార్గమధ్యంలో ధర్మవరంలో దిగి టిడిపి నాయకులను పలకరించారు. టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అచ్చయ్య నాయుడును పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. తదుపరి పుట్టపర్తికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమతం కాటమయ్య ,కాచర్ల కంచన్న, చింతపల్లి మహేష్ చౌదరి,పోతుకుంట లక్ష్మన్న , నాగూరు హుస్సేన్, కృష్ణాపురం జమీర్ అహ్మద్ ,మారుతి స్వామి, రాళ్లపల్లి షరీఫ్, బొట్టు కృష్ణ ,కుళ్లాయప్ప, చెన్నూరు విజయ్ చౌదరి, వరదరాజులు, ఉస్మాన్, అంబటి సనత్ తదితరులు పాల్గొన్నారు.