Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పొడిగింపు పట్ల సీఎం కి కృతజ్ఞతలు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పొడిగించడం పట్ల ఉరవకొండ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం నిబంధనలను సవరించి ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ప్రైవేటు పాఠశాలల యజమానులు ఇటీవల ఎమ్మెల్సీలుగా గెలిచిన ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కి విజ్ఞప్తి చేయడం జరిగిందని. వారి కూడా ముఖ్యమంత్రి విద్యా శాఖ మంత్రితో చర్చించడం జరిగిందని వారి యొక్క వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 38వ జీవో 8 సంవత్సరాల గడువును పెంచడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాలు ముందు పొడిగింపు ఉత్తర్వులు పొందిన వారికి కూడా 8 సంవత్సరాలు వర్తిస్తుందని తెలిపారు. అంతేకాకుండా పైల్స్ అన్నీ ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు రెన్యువల్ గడువును పెంచడం జరిగింది అన్నారు. దీనికోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కి ఎమ్మెల్సీలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నాయకులు రఘు రాములు, నిజాముద్దీన్, గోవర్ధన చౌదరి, కిరణ్ కుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img