Friday, April 19, 2024
Friday, April 19, 2024

విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం

కరస్పాండెంట్ గోవిందరెడ్డి

విశాలాంధ్ర – పెద్దకడబూరు : క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడమే రేయిన్ బో హైస్కూల్ లక్ష్యమని కరస్పాండెంట్ గోవిందరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో హైస్కూల్ 6వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముందుగా వార్షికోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జెడ్పీటీసీ రాజేశ్వరి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు విరుపాక్షిరెడ్డి, జాము మూకయ్య, టీడీపీ నాయకులు మల్లికార్జున జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ గోవిందరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను రేయిన్ బో హైస్కూలు అందిస్తుందని స్పష్టం చేశారు. 600 మంది విద్యార్థులకు అన్ని అంశాలలో సృజనాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా పని చేయడం సంతోషకమన్నారు. గ్రామీణ స్థాయిలోను పేదలకు అందుబాటులో ఉండే ఫీజులతో అత్యుత్తమ విద్యను అందిస్తుందని తెలిపారు. రేయిన్ బో హైస్కూలు విద్యార్థులకు డిజిటల్ విద్యతోపాటు క్రీడల్లోను ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మీ పిల్లల బంగారు భవిష్యత్తు రేయిన్ బో హైస్కూలు మంచి వేదికగా ఉంటుందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

ఆటా పాటతో అలరించిన విద్యార్థులు
రేయిన్ బో హైస్కూలు 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఆటా పాటతో అలరించారు. క్లాసికల్, మెలోడి, మాస్, షోలో గ్రూపు డ్యాన్స్ లతో విద్యార్థులు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు రాఘవరెడ్డి, రంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img