Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ప్రతి కుటుంబానికి విధిగా బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వము యొక్క లక్ష్యం…

ఆర్డిఓ తిప్పే నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం డివిజన్ పరిధిలోని ఏడు మండలాల లోని రేషన్ కార్డ్ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా బియ్యమును తప్పనిసరిగా అందించడమే ప్రభుత్వము యొక్క లక్ష్యమని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఎన్ డి యు ఆపరేటర్లతో డిఎస్ఓ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఏడు మండలాల ఎండీయూ ఆపరేటర్స్ కు 76 ఐరిష్ డివైసెస్ పరికరాలను ఆర్డిఓ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ గతంలో వేలిముద్రలు పడనివారు బియ్యం పంపిణీ విషయంలో స్టోర్ డీలర్లు ఎన్నో ఇబ్బందులను పడేవారని, నేడు అలా లేకుండా వేలు ముద్ర పడని వారికి ఈ ఐరిస్ డివైసెస్ పరికరం ద్వారా తప్పక బియ్యం పంపిణీ చేయబడడం శుభదాయకమని వారు తెలిపారు. ఇకనుంచి ఈ పరికరం ద్వారా ఆటోమేటిక్గా ప్రతి కుటుంబానికి బియ్యం చేరుతుందని వారు తెలిపారు. ఎం డి యు ఆపరేటర్స్ తప్పనిసరిగా ఈ పరికరాన్ని సద్వినియోగం చేసుకొని, కుటుంబంలోని ప్రతి లబ్ధిదారునికి బియ్యం అందేలా సహకరించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ లక్ష్మీదేవి, రాష్ట్ర స్టోర్ డీలర్ నాయకులు పరంధామ రెడ్డి, ఎం డి యు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాపరెడ్డి, డివిజన్ పరిధిలోని సిఎస్డిటీలు శారద, కవిత, సావిత్రి, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img