విద్యార్థి సంఘాల డిమాండ్
విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణం లోని గుంతకల్లు రోడ్ లో జనవాసాలు మధ్య నిర్వహిస్తున్న భవాని బార్ అండ్ రెస్టారెంట్ ను తక్షణమే మూసివేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉరవకొండలో వారు విలేకరులతో మాట్లాడుతూ రెస్టారెంట్ ను జననివాసాల, స్కూల్లో, ఆసుపత్రి, బ్యాంకులు, మరియు మీ సేవ కేంద్రాలతొ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో నిర్వహించడం ఎంత మాత్రం కూడా తగదన్నారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు అదేవిధంగా యువత మద్యానికి బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మద్యం తాగి బైక్ రైడింగ్ లు చేస్తూ యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరొ పించారు.ప్రజలకు మహిళలకు విద్యార్థులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి బార్ అండ్ రెస్టారెంట్ ను మూసి వేయించాలన్నారు లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జివిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం, ఏఐఎస్ఎఫ్ నాయకులు చిరంజీవి, అనిల్ కుమార్, ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు భీమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు గణేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు సింహాద్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు.