Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

అనంత ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ కి వినతి పత్రం అందజేసిన
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున

విశాలాంధ్ర- అనంతపురం : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2020-21 రైతు ఉద్యమం సందర్భంగా సంయుక్తా కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు.. గురువారం దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కి రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు ఉద్యమం హామీలను అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ… ఆనాడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నాన్చుడు ధోరణి ప్రభుత్వాలకు మంచిది కాదన్నారు. ఎంపీ కి ఇచ్చిన వినతి పత్రంలో అనేక రకాల వ్యవసాయ కూలీల కొరకు డిమాండ్లన్నింటినీ పరిష్కరించే దిశగా ఎంపీలు పార్లమెంట్లో మంత్రుల వద్ద చర్చించాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా అన్ని పంటలకు సి 2 ప్లస్ 50% ప్రకారం మద్దతు ధరల చట్టం చేసి అమల కోసం హామీలు ఇవ్వాలన్నారు. రైతులు వ్యవసాయ కార్మికులకు ఒకసారి రుణముక్తి కలిగించాలి వ్యవసాయ ఆత్మహత్యలు లేకుండా అత్యంత ప్రమాదకరంగా మారనున్న స్మార్ట్ మీటర్లు రద్దుచేసి విద్యుత్తు ప్రైవేటీకరణ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా సమగ్ర బీమా పథకం అన్ని పంటలకు పసుపు పోషణ సంబంధిత ప్రభుత్వ రంగం పరిధిలోనే వర్తింప చేయాలన్నారు. ప్రభుత్వాలు రైతులు వ్యవసాయ కార్మికులకు అందరికీ పింఛన్లు ప్రతినెల పదివేలకు పెంచి ఇవ్వాలని రైతు అనుకూలమైన భూసేకరణ చట్టం 2013ను అమలు చేసి ప్రతి సంవత్సరం పెరిగే భూమి ధరలకు అనుగుణంగా అమలు చేయాలన్నారు ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రైవేటు అవసరాలకు బలవంతపు భూసేకరణకు భూమి కోల్పోయిన వారికి ఇతర విధంగా నష్టపోయిన వారికి పునరావాసం కల్పించి వారికి న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రాజ్యాంగం ప్రకారం బలమైన కేంద్రం బలమైన రాష్ట్రాలు ఉండాలంటే రాష్ట్రాలకు కూడా పన్ను విధించే హక్కును సమైక్య విధానం ప్రకారం కల్పించాలంటే జిడిపి వాటా తో ప్రత్యేక కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలన్నారు. చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు మరియు లఖింపూర్ బేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని రైతు ఉద్యమ పోరాటంలో రైతులపై పెట్టిన కేసులన్నీ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అదేవిధంగా సింఘు,టిక్రి బోర్డర్లో చనిపోయిన 736 మంది రైతులకు జ్ఞాపకార్థం ఒక స్మారక నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మి నారాయణ సానుకూలంగా స్పందిస్తూ నేడు రైతాంగం పడుతున్న బాధలు ఇబ్బందులు చూస్తే నిజంగా బాధాకరమన్నారు.. కరువచ్చిన వరదలు ఎక్కువ వచ్చిన రైతు తీవ్రంగా నష్టపోతున్నాడని ఆ రైతు సంక్షేమం కోసం, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం, రైతు సంఘాల ఆధ్వర్యంలో మాకు వినతిపత్రంలో ఉన్న డిమాండ్స్ అన్నిటి పైన జరగనున్న పార్లమెంటులో మరియు కేంద్ర మంత్రుల వద్ద చర్చించి రైతాంగానికి తగు న్యాయం చేకూర్చడానికి నా వంతు కర్తవ్యం గా నేను పార్లమెంట్లో పోరాడుతానని నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ, జిల్లా కోశాధికారి రాయుడు,రైతు సంఘము వైస్ ప్రెసిడెంట్ చంద్ర శేఖర్ రెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాయుడు, రైతు సంఘము నాయకులు వెంకట రాముడు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img