Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

స్థలాలు అక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్థలాలను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులో నమోదు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఎం ఉరవకొండ మండల కార్యదర్శి మధుసూదన్,జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి పేర్కొన్నారు.సోమవారం ఉరవకొండలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరవకొండ మేజర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆ స్థలాలకు కంచెలు ఏర్పాటు చేసి కాపాడాలన్నారు.దేవాంగ కళ్యాణ మండపం దగ్గర 13.50సెంట్లు,పాత వైసిపి కార్యాలయం ఆఫీస్ దగ్గర 20 సెంట్లు కబ్జా చేశారని,అదేవిధంగా టీచర్స్ కాలనీ ఎదుట ఉన్న పంచాయతీ స్థలాన్ని కొంతమంది అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.పాత స్టేట్ బ్యాంక్ దగ్గర లత్తవరం రోడ్డులో పంచాయతీలో ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా బంకులు ఏర్పాటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.పంచాయతీ స్థలాలు అక్రమించుకున్న,పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా బంకులు ఏర్పాటు చేసుకున్న అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదంటే విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే మామూళ్ల మత్తులో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మార్పిడి జరిగినప్పుడల్లా ఉరవకొండలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం అలవాటుగా మారిందన్నారు ప్రభుత్వ అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి వారిచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వారికి అండగానిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలలో కంచెలు ఏర్పాటు చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కొరకు సిపిఎం జెండాలు పాతి పంపిణీ చేపడతామని హెచ్చరించారు.అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో చంద్రమౌళికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామాంజనేయులు నాయక్,మురళి,రవి,సీనప్ప,సిద్ధప్ప,మోహన్,వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img