Monday, September 25, 2023
Monday, September 25, 2023

మణిపూర్ సంఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి

విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి టి. రంగయ్య పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో మణిపూర్ లో మహిళలపై జరిగిన సంఘటనకు నిరసన తెలిపారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అకృత్యాలు, అధికమయ్యాయన్నారు. మణిపూర్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా ప్రధాన జాతుల మధ్య వైషమ్యాలు పెరిగి దారుణ మారణకాండ కొనసాగుతోంద న్నారు.ఈ అల్లర్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 150 మంది మరణించారని చెప్పు చున్నారని, అనధికారికంగా 500 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయార న్నారు. ఈ అల్లర్లలో మహిళపై దాడులు అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. గత పది రోజుల క్రితం ఇద్దరు గిరిజన స్త్రీలను ఈ అల్లరి మూకలు బహిరంగంగా వివస్త్రను చేసి నగ్నంగా ఊరేగించార న్నారు. కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోనం వీడి మణిపూర్ లో మహిళలను వివస్త్రను చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. సిపిఐ మండల కార్యదర్శి నాగరంగయ్య, రత్నమయ్య, సంజన్న, నాయక్, నరసింహారెడ్డి, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img