Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం

హిందూపురం జిఆర్పి పోలీసులు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని రేగాటిపల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం ఉదయం 36 సంవత్సరాలు వయసుగల వై సోమశేఖర్ రైలు కింద పడి మృతి చెందిన విషయం తెలిసింది. దీంతో జిఆర్పి పోలీసులు మృతుని ఫోటోను వివిధ వాట్స్అప్లకు పంపడం జరిగింది. ఈ వాట్సాప్ లో చూచిన కుటుంబ సభ్యులు హుటాహుటిన శనివారం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతి చెందిన వ్యక్తిని మా వ్యక్తిగా గుర్తించడం జరిగిందని జి ఆర్ పి పోలీసులు తెలిపారు. మృతి చెందిన సోమశేఖర్ భార్య నాగవేణి తో పాటు ఒక కూతురు కొడుకుతో నివసించేవాడని, చేనేత వృత్తితో సోమందేపల్లి లో ఉంటూ కొన్ని నెలల తర్వాత ధర్మవరం కు రావడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడ మధ్యమునకు బానిసై, తెలిసిన, తెలియని చోట అప్పులు చేసి, అప్పులు తీర్చలేక, ఆర్థిక సమస్యలతో కుటుంబ పోషణ భారమై, జీవితముపై విరక్తి చెంది, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. తదుపరి ఈ మృతి చెందిన విషయాన్ని మీడియా మిత్రులతో పాటు, వివిధ గ్రూపుల్లో ఉన్న వారు కూడా సహకరించినందుకు, జి అర్ పి పోలీసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img